నిజామాబాద్ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్ట్ లో బుధవారం(జనవరి 17) HDFC బ్యాంకు సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి.. రెండు కాళ్లు బయట, బాడీ లోపల ఉండిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ రెస్క్యూ టీం సహాయక చర్యలు చేప్పటారు. సెక్యూరిటీ గార్డ్ ని ప్రాణాలతో బయటకు తీశారు. సెక్యూరిటీ గార్డు గంటన్నర నరకం అనుభవించాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ రెండు కాళ్లు బయట.. బాడీ లిఫ్ట్ లో ఇరుక్కుపోవడంతో కాళ్లు, చేతులు విరిగిపోయాయి. సెక్యూరిటీ గార్డుని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.