
HDFC బ్యాంక్ యూపీఐ సేవలకు ఫిబ్రవరి 8,2025న అంతరాయం ఏర్పడనుంది.సిస్టమ్ మెయింటెనెన్స్ లో భాగంగా ఆ రోజు HDFC బ్యాంక్ UPI సేవలకు మూడు గంటల డౌన్‌టైమ్‌ను ప్రకటించింది. అంటే సిస్టమ్ నిర్వహణ కోసం శనివారం అర్థరాత్రి 12గంటల నుంచి తెల్లవారుజామున 03గంటల వరకు యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి.
ఈ డౌన్ టైమ్లో HDFC బ్యాంక్ ఖాతాలు, RuPay క్రెడిట్ కార్డ్‌లు, HDFC మొబైల్ బ్యాంకింగ్ యాప్,TPAPలలో UPI లావాదేవీలు పనిచేయవు. అవసరమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేయాలని కస్టమర్‌లకు బ్యాంకు అధికారులు సూచించారు.
నిలిచిపోయే సేవలు
- HDFC బ్యాంక్ కరెంట్/పొదుపు ఖాతాలు
- రూపే క్రెడిట్ కార్డులు
- UPI కోసం HDFC బ్యాంక్ మద్దతు ఇచ్చే HDFC మొబైల్ బ్యాంకింగ్ యాప్, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు (TPAPలు).
- HDFC బ్యాంక్ ద్వారా వ్యాపారి UPI లావాదేవీలు