హెచ్​డీఎఫ్​సీ లాభం రూ.16,174 కోట్లు

హెచ్​డీఎఫ్​సీ లాభం రూ.16,174 కోట్లు
  • వార్షికంగా 35 శాతం అప్​..సీక్వెన్షియల్‌‌గా 2.1 శాతం డౌన్

న్యూడిల్లీ : హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్​ క్వార్టర్​లో పన్ను తర్వాత లాభం 35.3 శాతం పెరిగి రూ.16,174.75 కోట్లకు చేరుకుంది.  కన్సాలిడేటెడ్​ విధానంలో ఇది 33.17 శాతం పెరిగి రూ.16,474.85 కోట్లకు చేరుకుంది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో బ్యాంకు కన్సాలిడేటెడ్​ ప్రాతిపదికన రూ.12,370 కోట్ల లాభం సంపాదించింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ నికర లాభం 2.1 శాతం పడిపోయింది. బ్యాంకు మొత్తం ఆదాయం క్రితం ఏడాది రూ.57,816 కోట్ల నుంచి రూ.83,701 కోట్లకు పెరిగింది.

పెరిగిన ఎన్​పీఏలు

బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్​పీఏ) నిష్పత్తి జూన్ 30 నాటికి 1.33 శాతానికి పెరిగాయి. ఇవి గత క్వార్టర్​లో 1.24 శాతం ఉండగా, క్రితం సంవత్సరం  1.17 శాతం ఉన్నాయి. నికర ఎన్​పీఏ నిష్పత్తి మార్చి 31 నాటికి 0.33 శాతం ఉంది.  జూన్ 30, 2023 నాటికి 0.30 శాతంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ 30 నాటికి 0.39 శాతానికి పెరిగింది.  బ్యాంక్ స్థూల ఎన్​పీఏలు ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ. 33,025.69 కోట్లకు పెరిగాయి.

ఇవి మార్చి 31 నాటికి రూ. 31.173.32 కోట్లు,  జూన్ 30, 2023 నాటికి రూ. 19,064.12 కోట్లు ఉన్నాయి. నికర ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏలు రిపోర్టింగ్ క్వార్టర్​లో రూ. 9,508.44 కోట్లు ఉన్నాయి. గత క్వార్టర్​లో 8,091.74 కోట్లు,  క్రితం సంవత్సరం రూ. 4,776.87 కోట్లు ఉన్నాయి. ప్రొవిజనింగ్ రూ.2,860 కోట్ల నుంచి రూ.2,602 కోట్లకు తగ్గింది.

డిపాజిట్లు,  అడ్వాన్సులు

ఈ ఏడాది జూన్ 30 నాటికి బ్యాంకు మొత్తం డిపాజిట్లు రూ. 23.79 లక్షల కోట్లకు చేరాయి. ఇవి వార్షికంగా 24.4 శాతం పెరిగాయి. ‘కాసా’ డిపాజిట్లు 6.2 శాతం పెరిగాయి. సేవింగ్స్​ ఖాతా డిపాజిట్లు రూ. 5.97 లక్షల కోట్లు,  కరెంట్ ఖాతా డిపాజిట్లు రూ. 2.67 లక్షల కోట్లకు పెరిగాయి. టైమ్ డిపాజిట్ల విలువ రూ. 15.15 లక్షల కోట్లకు చేరింది.   గత ఏడాది ఇదే క్వార్టర్​తో పోలిస్తే ఇవి 37.8 శాతం పెరిగాయి. జూన్ 30 నాటికి స్థూల అడ్వాన్సులు రూ.24.87 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ఇవి ఏడాదికి 52.6 శాతం పెరిగాయి. రిటైల్ లోన్లు 100.4 శాతం, వాణిజ్య  గ్రామీణ బ్యాంకింగ్ లోన్లు 23 శాతం,  ఇతర టోకు లోన్లు 18.7 శాతం పెరిగాయి. మొత్తం అడ్వాన్సుల్లో ఓవర్సీస్ అడ్వాన్సులు 1.5 శాతం ఉన్నాయి. బ్యాంక్ మొత్తం మూలధన సమృద్ధి జూన్ 30, 2024 నాటికి 19.33 శాతం ఉంది.