న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ లైఫ్ డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్లో రూ.415 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇది ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగింది. ఈ ప్రైవేట్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ గత డిసెంబరు క్వార్టర్లో రూ.365 కోట్ల లాభం ఆర్జించింది.
మొత్తం ఆదాయం మాత్రం రూ.26,694 కోట్ల నుంచి రూ. 16,914 కోట్లకు పడిపోయింది. కంపెనీ సాల్వెన్సీ రేషియో ఏడాది లెక్కన 190 శాతం నుంచి 188 శాతానికి తగ్గింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి హెచ్డీఎఫ్సీ లైఫ్‌కు రూ.1,326 కోట్ల లాభం వచ్చింది.