బైక్ స్పీడ్ గా నడపొద్దు అన్నందుకు కొట్టిచంపాడు ..ఆలస్యంగా వెలుగులోకి ఘటన

బైక్ స్పీడ్ గా నడపొద్దు అన్నందుకు కొట్టిచంపాడు ..ఆలస్యంగా వెలుగులోకి ఘటన
  • బైక్పై మెల్లగా పొమ్మన్నందుకు కొట్టి చంపారు..
  • అల్వాల్​లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

అల్వాల్ వెలుగు : రోడ్డుపై వేగంగా వెళుతున్న ఓ బైకర్​ను మెల్లిగా వెళ్లాలని కోరినందుకు ఆగ్రహంతో కొట్టాడు. ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ 15 రోజుల తర్వాత చనిపోయాడు.  ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

ఆల్వాల్ సీఐ రాహుల్​ దేవ్​  వివరాల ప్రకారం ఓల్డ్ అల్వాల్లో  నివాసముండే ఆంజనేయులు(68)రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి గత నెల 30న  శ్రీ బేకరీ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని కోప్పడ్డాడు. మెల్లిగా వెళ్లాలని కోరాడు. 

దీంతో  బైక్​పై ఉన్న దీపక్  ఆ  వృద్ధుడిని తీవ్రంగా చితకబాదాడు. ఈ ఘటనలో ఆంజనేయులుకు తలకు గాయాలయ్యాయి. దవాఖానకు  తరలించగా15 రోజులపాటు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో కుమారుడు ప్రవీణ్ అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితుడు దీపక్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.