బ్యాంకును మోసం చేసి దర్జాగా తిరుగుతున్న నిందితుడు 22 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. 22 ఏళ్ల క్రితం బ్యాంకును మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న పోలీసులకు చిక్కిన ఘటన తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 2002 ఆ ప్రాంతంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన చలపతి రావు అనే వ్యక్తి ఫేక్ కొటేషన్స్ తో హైదరాబాద్ లోని ఎస్బీఐల బ్యాంకులో బ్యాంక్ అధికారుల కళ్లు కప్పి 50 లక్షల నిధులు కొట్టేశాడు. వెంటనే బ్యాంక్ అధికారులు కేసు పెట్టినా లాభం లేకపోయింది. అప్పటినుంచి చట్టానికి దొరక్కుండా చలపతి రావు తప్పించుకు తిరుగుతున్నాడు.
తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ 2004 లో మిస్సింగ్ కంప్లెయింట్ చేసింది నిందితుడి భార్య. రెండు కేసుల్లో విచారణ ప్రారంభించిన పోలీసులకు చలపతిరావు దొరక్కుండా చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో తమిళనాడు, భూపాల్, ఉత్తరాఖాండ్, రాజస్థాన్ తన పేరు మార్చుకుని తలదాచుకున్నాడు నిందితుడు. కేసు సీరియస్ నెస్ ను అర్థం చేసుకున్న లోకల్ పోలీస్ కేసును సీబీఐకి అప్పజెప్పింది. నిందితుడి కదళికలపై ఓ కన్నేసిన సీబీఐకి తమిళనాడు నుంచి శ్రీలంకకి పారిపోతుండగా నిందితుడు చిక్కాడు. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో చలపతి రావును సీబీఐ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.