కరెంట్ వాడుకుంటూ బిల్లు కట్టమంటే విద్యుత్ ఏఈ పైనే ఓ వినియోగదారుడి జులుం చూపించాడు. ఈ ఘటన చాదర్ ఘాట్ లో 2023 ఆగస్టు 02 బుధవారం రోజున చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న వినియోగదారుడు గత కొన్ని నెలలుగా కరెంట్ వాడుకుంటూ బిల్లు చెల్లించడం లేదు.
బిల్లు 80 వేలు అయిందని కట్టాల్సిందేనని అతనికి పలుమార్లు సమాచారం ఇచ్చారు ఏఈ ఎస్ఎం ఖాద్రీ, అయినప్పటికీ అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అతని ఇంటికి కరెంట్ కట్ చేశారు విద్యుత్ సిబ్బంది.
ఈ క్రమంలో ఏఈ ఆఫీస్ కార్యాలయానికి వచ్చిన వినియోగదారుడు ఖాద్రితో ఘర్షణకు దిగాడు. సౌత్ జోన్ పరిధిలో డ్యూటీ చేయడం కష్టంగా మారిందంటూ విద్యుత్ శాఖ సిబ్బంది చెప్తోంది.