మద్యానికి బానిసై ఫ్లైఓవర్ పైనుంచి దుంకిండు

మూసాపేట: మద్యానికి బానిసై ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఎస్ఆర్​నగర్​లోని బాపునగర్​కు చెందిన భూక్యా అశోక్​(36) మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. కొంతకాలం తర్వాత రుక్సానాబేగం అనే మహిళను పెండ్లి చేసుకున్నాడు. వెల్డింగ్ పనిచేసే అశోక్ మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగొచ్చి భార్యను వేధించేవాడు. చనిపోతానని బెదిరించేవాడు. సోమవారం ఉదయం 6 గంటలకే మద్యం తాగుడు మొదలుపెట్టిన అశోక్.. భార్య రుక్సానా బేగంను కొట్టాడు. ఈ తర్వాత చనిపోతానని చెప్పి మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు బాలానగర్​ఫ్లై ఓవర్ పైనుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అశోక్​ను గాంధీకి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.