భారత జట్టును అతను కాపాడగలడు.. యువ క్రికెటర్‌పై ఆశిష్ నెహ్రా ప్రశంసలు

భారత జట్టును అతను కాపాడగలడు.. యువ క్రికెటర్‌పై ఆశిష్ నెహ్రా ప్రశంసలు

మనకంటే ఒక తరం ముందు అంటే 90'స్ అభిమానుల్లో ఒక్కటే ఆలోచన.. ఇప్పుడైతే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ రాణిస్తున్నారు.. బాగానే ఉంది. మరి వీరు దూరమయ్యాక భారత జట్టు ఏమవుతోందో..! మరి ఇప్పటి అభిమానుల్లో.. ప్రస్తుతానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండటంతో భారత జట్టు గట్టెక్కుతోంది. వీరు తప్పుకున్నాక పరిస్థితి ఏంటో..! ఇలా ఒక తరం ఆటగాళ్లు దూరమయ్యే కొద్దీ అభిమానుల్లో వింత ఆలోచనలు రావడం సహజమే. ఆ ప్రశ్నకు భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా బహులిచ్చారు.

గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో సెంచరీ బాదిన యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన నెహ్రా.. భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ఆడగల సమర్ధవతుండైన ఆటగాడిని కొనియాడారు. ఏ ఫార్మాట్‌లో ఎలా ఆడాలో తెలిసిన ఆటగాడిని.. ఎటువంటి పరిస్థితులలోనైనా జట్టును కష్టాల నుంచి కాపాడగలిగే సత్తా అతనిలో ఉందని తెలిపాడు.

"అతను (రుతురాజ్ గైక్వాడ్) ఎలాంటి ఆటగాడో మీ అందరికీ తెలుసు. యశస్వి జైస్వాల్ గురించి మాట్లాడితే, రుతురాజ్ గైక్వాడ్‌తో పోలిస్తే అతని ఆట పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతను ధనాధన్ బ్యాటింగ్ తో అలరిస్తాడు. అదే గైక్వాడ్ విషయానికొస్తే అతడు దూకుడుగా ఆడతాడు. అలా ఆడటానికి ముందు జట్టు పరిస్థితుల గురుంచి ఆలోచించాలి. ఏ ఫార్మాట్‌ అయినా పటిష్టత అవసరం. అతనిలో ఆ సత్తా ఉంది. రుతురాజ్ గైక్వాడ్ త్రీ ఫార్మాట్ ప్లేయర్. అతను భారత్‌ జట్టుకు మూడు ఫార్మాట్లలో ఆడగల ఆటగాడు అనడంలో సందేహం లేదు.. " అని నెహ్రా జియో సినిమాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

4 మ్యాచ్‌ల్లో 213 పరుగులు

కాగా, ఈ సిరీస్‌లో గైక్వాడ్ 4 మ్యాచ్ ల్లో 71 సగటుతో 213 పరుగులు పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.