
ఏపీ సీఎం జగన్ ను రాయితో కొట్టిన వ్యక్తిని గుర్తించారు సిట్ అధికారలు.సతీష్ అనే యువకుడు సీఎం జగన్‍పై రాయి విసిరినట్లు నిర్ధారించారు పోలీసులు. సతీష్ అజిత్‍సింగ్ నగర్ వడ్డెరకాలనీకి చెందినట్టుగా గుర్తించామన్నారు. సతీష్ తో పాటు అతని వెంట ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్‍లను కూడా అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు. సీఎంపై దాడి వెనుక ఉన్న కారణాలపై యువకులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
ఫుట్‍పాత్ కోసం వేసే టైల్ రాయితో దాడి చేసినట్లు గుర్తించారు. రాయిని జేబులో పెట్టుకుని వచ్చి, సడన్ గా సీఎం జగన్ పై సతీష్ దాడి చేశాడని గుర్తించారు పోలీసులు. మరోవైపు సీఎం జగన్ ను రాయితో కొట్టడంతో ఏపీ వ్యాప్తంగా రాజకీయాల్లో రగడ జరిగింది. అటు మాజీ సీఎం చంద్రబాబుపై, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్లు విసిరారు ఆగంతకులు. దీనిపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటాని పోలీసులు తెలిపారు.