
- ఆన్‌లైన్‌లో అవకాడో కొనబోయి రూ.2.6 లక్షలు పోగొట్టుకున్నడు!
- జస్ట్ డయల్లో చూసి కాల్ చేసిన స్టూడెంట్
- చీట్చేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆన్‌లైన్‌లో అవకాడోలు కొనుగోలు చేయాలనుకున్న ఓ స్టూడెంట్(23) సైబర్ మోసానికి గురై రూ.2లక్షల60వేలు కోల్పోయాడు. జస్ట్ డయల్ యాప్ ద్వారా అవకాడోలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన స్టూడెంట్ కు ‘బాలాజీ ట్రేడర్స్’ పేరుతో కొందరు వల వేశారు.
విజయవాడ నుంచి ఫ్రెష్అవకాడోలు పంపిస్తామని చెప్పి, మొదట డెలివరీ కోసం డబ్బులు చెల్లించాలని కోరారు. తర్వాత, వారు వాహనం పాడైపోయిందని, ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని కల్పిత కథలతో విద్యార్థిని నమ్మించి పదేపదే డబ్బులు బదిలీ చేయించుకున్నారు.
అంతేకాక, డబ్బు తిరిగి చెల్లిస్తామని నమ్మించడానికి నకిలీ చెక్ఫొటో సహా కొన్ని ఫేక్ ఫొటోలు పంపారు. ఈ విధంగా విద్యార్థి నుంచి మొత్తం రూ.2.6 లక్షలు దోచుకున్నారు. తాను మోసపోయానని తెలుసుకున్న స్టూడెంట్చివరకు వారిని ప్రశ్నించగా బెదిరించారు. భయపడిన విద్యార్థి, తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. చివరకు సిటీ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.