
పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు 14 వేల కోట్ల రూపాయలకు మోసగించిన వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ అరెస్టు విషయంపై ఈ స్కాంను బయటపెట్టిన విజిల్ బ్లోయర్ హరిప్రసాద్ ఎస్వీ స్పందించారు. మెహుల్ ఛోక్సీని ఇండియాకు తీసుకురావడం ఈజీ టాస్క్ కాదని ఈ సందర్భంగా అన్నారు. చోక్సీ దగ్గర చాలా డబ్బు ఉంది.. యూరోప్ లోని గొప్ప గొప్ప అడ్వకేట్స్ ను నియమించుకుని ఇండియాకు రాకుండా ఉండేందుకు మేనేజ్ చేస్తాడని అన్నారు. విజయ్ మాల్యా మాదిరిగా మేనేజ్ చేస్తాడని, ఇండియాకు తీసుకురావడం ప్రభుత్వానికి చాలా పెద్ద టాస్క్ అని అన్నారు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో సక్సెస్ అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. బెల్జియంలో అరెస్టైన మెహుల్ చోక్సీని ఇండియా తీసుకురావడమే కాదు.. అతడు లూటీ చేసిన కోట్ల సొమ్మును కూడా తీసుకురావడం ముఖ్యవిషయం అని అన్నారు.
VIDEO | On fugitive Mehul Choksi's arrest in Belgium, Punjab National Bank Scam whistle-blower Hariprasad SV says, "We can only hope, what is the guarantee (of his return)? Because Choksi knows how to get away from the law, he can buy the best of lawyers in the world. He will try… pic.twitter.com/fK1MblGAlZ
— Press Trust of India (@PTI_News) April 14, 2025
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జరుగుతున్న అవకతవకలపై బెంగుళూరుకు చెందిన ఆంత్రప్రెన్యూవర్ హరిప్రసాద్ 2016 జులై 26న ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశాడు . బ్యాంకులో పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరుగుతుందని, బ్యాలన్స్ షీట్స్ చూస్తుంటే అది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాడు. దీంతో కేంద్ర ఈ కేసులో విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత 2018 జనవరి 2న విదేశాలకు పారిపోయాడు. ఆ తర్వాత ముంబై కోర్టులో 2018, మే 23.. 2021, జూన్ 15న మెహుల్ చోక్సీపై రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. పంజాబ్ నేషన్ బ్యాంకులో13 వేల850 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసినందుకు సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్లకు అనుగుణంగానే చోక్సీ అరెస్ట్ జరిగినట్లు తెలిసింది. శనివారమే (ఏప్రిల్ 12) చోక్సీని అరెస్ట్ చేశారు.
అయితే దేశం విడిచి పారిపోక ముందే తెలివిగా ఛోక్సీ 2017లో ఆంటిగువా పౌరసత్వం తీసుకున్నాడు. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లి అటునుంచి ఆంటిగువాకు పారిపోయాడు. ఆ తర్వాత క్యూబాకు పారిపోతుండగా డొమినికా దేశంలో పట్టుబడ్డాడు. అయితే ఆంటిగువా నుంచి తమ క్లైంట్ ఛీక్సీని కిడ్నాప్ చేశారని అతని లీగల్ కౌన్సిల్ వాదించడంతో డొమినికా మళ్లీ ఆంటిగువాకు పంపించింది. క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం బెల్జియం వెళ్లిన ఛోక్సీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.