పల్లెల అభివృద్ధే ధ్యేయం : సుంకె రవిశంకర్

  • చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

గంగాధర, వెలుగు : పల్లెల అభివృద్ధే ధ్యేయమని, తమ ప్రభుత్వ హయాంలో కులసంఘాలను బలోపేతం చేస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆచంపల్లిలో రూ.4 లక్షలతో నిర్మించనున్న గౌడ సంఘ భవనానికి మంగళవారం ఆయన భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెల్లో అన్నిరకాల వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. అనంతరం బూరుగుపల్లిలోని తన నివాసంలో బొమ్మకంటిపల్లికి చెందిన బీజేపీ రజక మోర్చా మండల అధ్యక్షుడు జాగిరపు అంజయ్య, ఇరుకుల్ల నాగార్జున బీఆర్ఎస్​లో చేరారు. 

ALSO  READ :-  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూకుడు .. ఎన్నికల ముందు హడావుడి శంకుస్థాపనలు

కొడిమ్యాల : రైతు బీమాతో రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అన్నారు. మంగళవారం కొడిమ్యాల మండలానికి చెందిన రైతు అక్కెనపెల్లి గంగవ్వ, కొండాపూర్ గ్రామానికి చెందిన కనకట్ల రాజం ఇటీవల చనిపోగా వారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం రైతు బీమా ప్రొసీడింగ్‌‌‌‌‌‌‌‌ కాపీని అందజేశారు.