దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగినం : కడియం శ్రీహరి

ధర్మసాగర్, వెలుగు : దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే క్యాండిడేట్‌‌ కడియం శ్రీహరి చెప్పారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌‌ మండలంలోని మల్లక్‌‌పల్లి, ధర్మపురం గ్రామాల్లో గురువారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలల్లో ధర్మపురం గ్రామానికి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందిస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని, ఆరు గ్యారంటీలు అమలు సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్‌‌కు ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్లేనన్నారు. బీజేపీ క్యాండిడేట్లకు డిపాజిట్లు కూడా రావన్నారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌‌ ప్రయారిటీ ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత, డీసీసీబీ చైర్మన్‌‌ రాజేశ్వర్‌‌రెడ్డి, మండల అధ్యక్షుడు మునిగెల రాజు పాల్గొన్నారు.


ALSO READ: ఎందుకు చేస్తున్నారో చెప్పండ్రా బాబూ : వందే భారత్ పై రాళ్ల దాడి.. పగిలిన కిటికీ అద్దాలు