
జనగామ, వెలుగు : జనగామ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే లోకల్ క్యాండిడేట్ అయిన తనను గెలిపించాలని బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆరుట్ల దశమంతరెడ్డి కోరారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రత్యేక నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. అనంతరం పలువురు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.