సీతారామ ప్రాజెక్టుతో పాలేరుకు.. గోదావరి జలాలను తీసుకొస్తా : తుమ్మల నాగేశ్వరరావు

  •     మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నేలకొండపల్లి, వెలుగు : సీతారామ ప్రాజెక్టు పూర్తిచేయడం కోసమే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో రామచంద్రాపురం సహకార సంఘం చైర్మన్ గూడవల్లి రాంబ్రహ్మం ఏర్పాటు చేసిన తేనేటి విందులో తుమ్మల పాల్గొని మాట్లాడారు.

 రూ.70 కోట్లతో పాలేరు పాత కాలువకు రిపేర్లు చేయించామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని పాలేరుకు తీసుకురావాలనదే తన కల అని తుమ్మల చెప్పారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రమేశ్​రెడ్డి , శాఖమూరి రమేశ్, రామాంజరెడ్డి, హనుమంతరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.