లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీ యే కూటమి అత్యధిక సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్డీ యే కూటమి విజయంతో ఓ వ్యక్తి వేలు కట్ చేసి దేవునికి అర్పించాడు. చత్తీస్ గఢ్ లో బల్ రామ్ పూర్ కు చెందిన 30 ఏళ్ల దుర్గేష్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజార్టీ సాధించిన తర్వాత తన వేలిని నరికి కాలీమాతకు సమర్పించాడు.
జూన్ 4న లోక్ సభ ఎన్నికల తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్ ముందంజలో ఉందని తెలుసుకున్న దుర్గేష్ డిప్రెషన్ లోకి వెళ్లాడు. అ నంతరం కాళీ ఆలయానికి వెళ్లి బీజేపీ విజయం కోసం ప్రార్థనలు చేశారు.
తర్వాత బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడం, ఎన్డీయే కూటమికి మెజారిటీ 292 మార్క్ ను దాటం చూసిన పాండే ఆనందానికి అవధుల్లే కుండా పోయింది. మళ్లీ కాళీ ఆలయానికి వెళ్లి అక్కడ తన ఎడమచేతి వేలును కోసి అమ్మవారికి సమర్పించాడు.
తర్వాత గాయానికి గుడ్డ కట్టి రక్తం ఆపేందుకు ప్రయత్నించాడు.. కానీ సాధ్యపడేలేదు.. దీంతో కుటుంబ సభ్యులు దుర్గేష్ ఆస్ప త్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే.. ఆలస్యం కావడంతో అతని తెగిపోయిన వేలు భాగాన్ని డాక్టర్లు తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.