పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసి వికారాబాద్ జిల్లా ప్రాంత రైతులకు సాగునీరు అందించేలా కృషి చేస్తామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. పరిగిలో ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఆగమాగం చేశారని అన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పులన్నీ సరిదిద్దుతూ ప్రజలకిచ్చిన హామీల అమలు దిశగా దూసుకుపోతుందని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇళ్ళ స్థలాల కేటాయింపు, ఇళ్ళ నిర్మాణాల కోసం ఆర్థిక సహాయం అందేలా స్పీకర్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.