భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ.. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్ పెద్దకోపిష్టి అని వెల్లడించిన తివారీ.. అతను జట్టులో ఏ ఒక్కరితోనూ సఖ్యతగా నడుచుకున్న సందర్భాలు లేవని ఆరోపించాడు. తనను ఏ కారణం లేకుండా తిట్టేవాడని అన్నాడు. ఆ పద్ధతి సరైనది కాదని చెప్పిన అప్పటి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అగౌరవపరిచాడని ఆరోపించారు.
2015లో అరుణ్ జైట్లీ వేదికగాఢిల్లీ, బెంగాల్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య గొడవలు బాగా పెరిగాయి. ఆ మ్యాచ్‌లో గంభీర్‌తో జరిగిన వాగ్వాదం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తివారీ.. పలు షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ఔటైన కోపాన్ని గంభీర్.. జట్టు సహచరులపై చూపెట్టేవాడని అన్నాడు. పొరపాటున ఏ క్రికెటర్ అయినా అతనికంటే ఎక్కువ పరుగులు చేస్తే సహించకపోయేవాడని తెలిపాడు. ఓ మ్యాచ్‌లో తన విషయంలోనూ అదే జరిగిందని.. ఆ ఘటనను బయటపెట్టాడు.
ALSO READ | Charith Asalanka: జీరోలైన ఐపీఎల్ హీరోలు.. 2024 ఐసీసీ వన్డే జట్టులో మనోళ్లు ఒక్కరూ లేరు
"ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యాచ్‌లో నేను సెంచరీ(129 పరుగులు) చేశాను. గంభీర్ 110 పరుగులు చేశాడు. ఔటయ్యేక నేను డగౌట్ కు చేసుకోగానే గంభీర్.. నన్ను ఏ కారణం లేకుండా తిట్టడం మొదలెట్టాడు. ఆ తరువాత మ్యాచ్ ల్లోనూ అంతే. పదే పదే తిడుతుండేవాడు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో అర్థం అయ్యేది కాదు. 2010లో నేను, కేకేఆర్ టీమ్‌లోకి వచ్చాను. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. కొన్నాళ్లకు నేను భారత జట్టు తరుపున ఎంట్రీ ఇచ్చాను. బహుశా..! అదే అతనికి నచ్చలేదేమో.. నేనంటే అతనికి పడేది కాదు. కావాలని బూతులు తిట్టేవాడు. చాలా బాధ కలిగించే పదాలు వాడేవాడు.."
"అలా అతని తిట్లు భరిస్తున్న సమయంలో ఇంకో ఘటన జరిగింది. నేను కేకేఆర్(KKR) డ్రెస్సింగ్ రూంలో కూర్చొని సన్‌స్క్రీన్ రాసుకుంటుంటే.. లోపలికి వచ్చి ఇక్కడేం చేస్తున్నావ్..? అని అరిచాడు. కాసేపు అక్కడ నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను అతనికి ఎదురు చెప్పలేక బాధపడుతూ వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయాను. న వెంట అతను వాష్‌రూమ్‌కు వచ్చాడు. 'యాటిట్యూడ్ తగ్గించుకో.. ఐపీఎల్ లో నిన్ను ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వకుండా చేస్తా..' అని బెదిరించాడు. నేనేం తప్పు చేశానా..! అని నాకు అర్థమయ్యేది కాదు. ఆ తరువాత అతని తిట్లు నాకు కామన్ అయిపోయాయ్.." అని తివారి తన బాధనంతా బయటకు వెళ్లగక్కాడు.