బోధన్, వెలుగు: రోడ్డు నిర్మాణం కోసం రెంజల్మండల రైతులు కొనసాగిస్తున్న దీక్షలను వెంటనే విరమించుకోవాలని బోధన్ఎమ్మెల్యే మహ్మద్షకీల్ కోరారు. శుక్రవారం ఆయన బోధన్ లోని తన నివాసంలో మాట్లాడారు. రెంజల్–బ్రహ్మణపల్లి గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి రూ.3.70 కోట్లు మంజూరయ్యాయని, వారం రోజుల్లో టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు.
రెండేళ్ల క్రితమే రోడ్డు వేసేందుకు ఫండ్స్ మంజూరైనా, కాంట్రాక్టర్ చనిపోగా, కొత్త కాంట్రాక్టర్ నిర్మాణ పనుల్లో జాప్యం చేయడంతో ఆలస్యమైందన్నారు. తాత్కాలిక రోడ్డు నిర్మాణం కోసం రూ.20 లక్షలు మంజూరు చేసినా, వర్షం కారణంగా పనులు చేసే పరిస్థితి లేదన్నారు.