
ఆత్మకూరు, వెలుగు : రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం పెద్దాపురం, ఆత్మకూర్ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన రైతు సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
రేవంత్‌రెడ్డికి వ్యవసాయం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ సరిగా ఇవ్వకపోవడంతో రైతులు రాత్రిపూట జాగారం చేయాల్సి వచ్చేదని గుర్తు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనం పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ రాధిక, రైతు సమన్వయ సమితి నాయకులు ఎన్కతాళ్ల రవీందర్ పాల్గొన్నారు.