విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్.. వీరిలో ఎవరు గొప్ప అంటే ఇద్దరూ గొప్పే. ఈ భారత క్రికెటర్లిద్దరూ తమ తమ ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది భారత క్రికెట్ అభిమానులకు సొంతోషాన్నిచ్చేదే. కాకపోతే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సరికాదు. తాజాగా, భారత మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్.. అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈమధ్యే ధోనీ, తాను క్లోజ్ ఫ్రెండ్స్ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన యువీ, ఇప్పుడు కోహ్లి గురించి అలాగే స్పందించారు.
క్రిస్టియానో రొనాల్డో అనుకుంటాడు!
కోహ్లీ ఫుట్‌బాల్ స్కిల్స్ గురుంచి టిఆర్‌ఎస్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన యువీ.. కోహ్లీ కంటే తాను మెరుగైన ఆటగాడినని వెల్లడించారు. అతని కంటే తన నైపుణ్యాలు చాలా ఎక్కువని తెలిపారు.
"నేను విరాట్ తో ఫుట్‌బాల్ ఆడాను.. నెహ్రా(ఆశిష్ నెహ్రా)తో, వీరూ (సెహ్వాగ్)తో ఫుట్‌బాల్ ఆడాను.. ఉస్కో (విరాట్ కోహ్లీ) తాను గొప్ప ఫుట్‌బాలర్ అని అనుకుంటాడు. కానీ అతని కంటే నాకు ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి. అతడు యువకుడు. బాగా పరుగెత్తుతాడు. అందువల్ల తనను తాను క్రిస్టియానో రొనాల్డో అనుకుంటాడు. అతను క్రికెట్ లో రొనాల్డోనే కాదనను.. కానీ ఫుట్‌బాల్‌లో మాత్రం అతని కంటే నేను మెరుగైనవాడిని.." అని యువీ మాట్లాడారు.
యువీ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. ఈమధ్య కాలంలో యువీ ఏదేదో మాట్లాడుతున్నారని, ఒకసారి మంచి వైద్యుడిని సంప్రదిస్తే బాగుంటదని సలహా ఇస్తున్నారు.