
- చిన్న చిన్న విషయాలకు కుంగిపోవద్దు
- గవర్నర్ తమిళసై సౌందరాజన్
హైదరాబాద్: యువత ఉద్యోగం పొందే స్థాయి నుంచి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరాజన్. శనివారం హైదరాబాద్ లోని జేఎన్టీయూ 10వ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళసై సౌందరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. విద్యార్థలు చిన్ని చిన్న విషయాలకే కుంగిపోవద్దన్నారు. పరీక్షలు జీవితంలో భాగమని.. పరీక్షల్లో తప్పినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్లుకాదన్నారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్నారు. తాను మెడికల్ కాలేజీలో టీచర్ గా పని చేశానని, విద్యార్థుల సైకాలజీ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రవేశించాలని, పురుషులతో సమానంగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.