ఇరిగేషన్‌‌లో ఎక్స్‌‌టెన్షన్లు వద్దు... మంత్రి ఉత్తమ్‌‌ కుమార్ రెడ్డికి హెచ్‌‌ఈఏ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్‌‌మెంట్‌‌లో రిటైర్ అయిన ఉన్నతాధికారులకు ఎక్స్‌‌టెన్షన్లు ఇవ్వొద్దని  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ (హెచ్‌‌ఈఏ) ప్రతినిధులు కోరారు. మంగళవారం మంత్రికి వారు వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వం అధికారులు రిటైర్ అయినా విచ్చలవిడిగా  సర్వీస్ పొడిగించడంతో ఎంతో మంది అర్హులైన అధికారులకు అన్యాయం జరిగిందని వాపోయారు.

ఎవరికీ ఎక్స్‌‌టెన్షన్లు ఇవ్వబోమంటూ ప్రస్తుత ప్రభుత్వం మాటిచ్చిందని, ఆ మాటను నిలబెట్టుకోవాలని కోరారు. వారి సేవలను వినియోగించుకోవాలనుకుంటే సలహాదారుగానో, ఓఎస్డీగానో లేదంటే కాంట్రాక్ట్ బేసిస్‌‌లో కన్సల్టెంట్‌‌గానో నియమించుకోవాలని, కేడర్ పోస్టుల్లో మాత్రం ఎక్స్‌‌టెన్షన్ ఇవ్వొద్దని వారు విజ్ఞప్తి చేశారు.