కొడుకు పెద్దకర్మ చేసి.. గుండెపోటుతో తండ్రి మృతి ..

జ్యోతినగర్, వెలుగు:  పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలో ఓ హెడ్​కానిస్టేబుల్​గుండెపోటుతో చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. బోయోజు సోమరాజు( 54)  గోదావరిఖని టూటౌన్‌‌‌‌‌‌‌‌ 8 ఇంక్లైన్ కాలనీ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో హెడ్​కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌. శనివారం రాత్రి ఇంట్లో మెట్లు దిగుతుండగా జారిపడడంతో హాస్పిటల్ కు తరలించారు. దీంతో హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు. మృతుడిది ఖమ్మం జిల్లా కాగా ఉద్యోగ రీత్యా ఎన్టీపీసీలో ఉంటున్నాడు. సోమరాజుకు భార్య, ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నాడు. కాగా, అమెరికా వెళ్లాల్సిన కొడుకు 13 రోజుల కింద అనారోగ్యంతో చనిపోగా..శుక్రవారం 11వ రోజు కర్మ నిర్వహించారు. మరుసటి రోజు రాత్రే తండ్రి సోమరాజు చనిపోయాడు. ఏఏస్సై చక్రపాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రామగుండం పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు పోచలింగం, దేవేందర్ గౌడ్.. సోమరాజు డెడ్‌‌‌‌‌‌‌‌బాడీకి నివాళులర్పించారు.