గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి.. ఐదు రోజుల్లోనే ముగ్గురు కానిస్టేబుల్స్

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి.. ఐదు రోజుల్లోనే ముగ్గురు కానిస్టేబుల్స్

ఈ మధ్య గుండెపోట్లు ఫ్యామిలీలను చిధ్రం చేస్తున్నాయి.ఉన్న చోటనే నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.  లేటెస్ట్ గా మహబూబాబాద్ జిల్లా  డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ సోమేశ్వర్ గుండెపోటుతో మృతి చెందాడు.  పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉండగానే   సోమేశ్వర్ కు గుండెపోటు వచ్చింది.  తోటి సిబ్బంది వెంటనే సీపీఆర్ చేశారు. అయినా ఆస్పత్రికి తరలించే లోపే హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని హెడ్ కానిస్టేబుల్ స్వగ్రామం పెద్దముప్పారానికి తరలించారు. హెడ్ కానిస్టేబుల్  కుటుంబానికి జిల్లా ఎస్పీ రాంనాద్ కేకన్  సంతాపం తెలిపారు. గత నెల రోజుల్లోనే ముగ్గురు కానిస్టేబుల్స్ గుండెపోటుతో చనిపోవడం గమనార్హం. 

 నెలలోనే ముగ్గురు కానిస్టేబుల్స్ 

  • జనవరి 29 రోజుల క్రితం సికింద్రాబాద్ లోని మార్కెట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కార్తీక్  గుండెపోటుతో చనిపోయాడు
  • జనవరి 30 న మంచిర్యాల జిల్లా టీజీఎస్ఎస్పీహెడ్ కానిస్టేబుల్ సలిగంటి లచ్చన్న (53) గురువారం చెన్నూరు పోలీస్ స్టేషన్ డ్యూటీలో భాగంగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.  
  • ఫిబ్రవరి 2న (ఇవాళ) మహబూబాబద్ డోర్నకల్ పీఎస్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సోమేశ్వర్ గుండెపోటుతో మృతి