గుండెపోటుతో హెడ్‌‌కానిస్టేబుల్ మృతి

భైంసా, వెలుగు :  నిర్మల్​ జిల్లా భైంసా పట్టణ పోలీస్​స్టేషన్‌‌లో హెడ్​ కానిస్టేబుల్‌‌గా విధులు నిర్వహిస్తున్న ఎం. భోజరాం (52) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు.  ఉదయం విధులు నిర్వహించుకుని మధ్యాహ్నంఇంటికి వెళ్లిన భోజరాం గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.  గమనించిన కుటుంబీకులు వెంటనే  భైంసా ఏరియా హాస్పిటల్‌‌కు తరలించగా..  

పరీక్షించిన వైద్యులు అప్పటికే భోజరాం మృతి చెందినట్లు నిర్ధారించారు. రెండేళ్లుగా పట్టణ పీఎస్‌‌లో  హెచ్‌‌సీగా విధులు నిర్వహిస్తున్న భోజరాం కుభీర్​ మండలంలోని హల్దా గ్రామ నివాసి.  మృతదేహానికి టౌన్​ సీఐ రాజారెడ్డి, తోటి సిబ్బంది నివాళులర్పించారు.