వరంగల్ నగరంలో ని మట్టెవాడలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి వాహనంతో పరారయ్యాడు డ్రైవర్. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు పోలీసులు. మృతుడు ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీరామ్‌రాజుగా గుర్తించారు.
మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. విధులకై పోలీస్ కమిషనరేట్ కి ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం వెనుక నుండి ఢీ కొనడంతో క్రింద పడి స్పృహ కోల్పోయాడు. దాంతో స్థానికుల సహాయంతో ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించే సమయంలో మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.