- మంచిర్యాల జిల్లా చెన్నూరు పీఎస్ లో డ్యూటీలో ఉండగానే ఘటన
చెన్నూర్, వెలుగు: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. టీజీఎస్ఎస్పీహెడ్ కానిస్టేబుల్ సలిగంటి లచ్చన్న (53) గురువారం చెన్నూరు పోలీస్ స్టేషన్ డ్యూటీలో భాగంగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
తోటి సిబ్బంది వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పాత మామిడిపల్లికి చెందిన లచ్చన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పోలీసు సిబ్బంది సంతాపం తెలిపారు.