జగిత్యాల జిల్లా మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ ను సస్పెండ్ చేశారు మల్టీ జోన్ ఐజీ రంగనాథ్. మార్చి 17న పోలీస్ స్టేషన్ పరిసరాలలో కొందరు రాజకీయ నాయకులతో కలిసి మధ్యం సేవించారని సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఈ ఘటనపై విచారణ జరపగా మార్చి 28న ఇద్దరు కానిస్టేబుల్స్ ధనుంజయ్, సురేష్ లను ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సస్పెండ్ చేశారు. ఇవాళ హెడ్ కానిస్టేబుల్ అశోక్ ను ఐజీ రంగనాథ్ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.