వైరా, వెలుగు : డ్యూటీలో ఉన్న ఓ హెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుతో చనిపోయాడు. కొత్తగూడెం జిల్లా గౌతమ్‌నగర్‌కు చెందిన ఈసం లోకేశ్ (50) 2000 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. 2021లో హెడ్‌కానిస్టేబుల్‌గా కొణిజర్ల పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.
శుక్రవారం రాత్రి డ్యూటీకి వచ్చిన లోకేశ్ బాత్రూంకు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి సిబ్బంది గమనించే సరికే లోకేశ్ చనిపోయినట్లు ఎస్సై సూరజ్ తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ మృతి పట్ల ఏసీపీ రహమాన్, సీఐ సాగర్, ఎస్సై సూరజ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.