
సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య సరిహద్దు భద్రతా కేంద్రాల్లో హెడ్ కానిస్టేబుల్ (ఆర్‌వో/ ఆర్‌ఎం) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు: మొత్తం 1312 ఖాళీల్లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్)– 982, హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) విభాగంలో 330 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హత: పదో తరగతి, 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్), ఐటీఐ (రేడియో అండ్ టెలివిజన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, జనరల్ ఎలక్ట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్క్ టెక్నీషియన్, మెకాట్రానిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలకు www.bsf.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.
ఏఎస్‌ఐ, హెచ్‌సీ పోస్టులు
బీఎస్‌ఎఫ్ లో ఖాళీగా ఉన్న 323 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్(10+2), ఇంగ్లిష్/ హిందీ షార్ట్‌హ్యాండ్, టైపింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్, షార్ట్‌హ్యాండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు.