రాష్ట్రంలో పోలీస్ ట్రైనింగ్ లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ రానాసింగ్ మృతి చెందడం సంచలనంగా మారింది.
ఏం జరిగిందంటే..
పదోన్నతిపై శిక్షణ కోసం కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో హెడ్ కానిస్టేబుల్ రానాసింగ్ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ట్రైనింగ్ సమయంలో రానాసింగ్ అస్వస్తతకు గురయ్యాడు. వెంటనే అతన్ని కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ రానాసింగ్ మృతి చెందాడు. అయితే హెడ్ కానిస్టేబుల్ మృతికి సంబంధించిన వివరాలను వైద్యులు ఇంకా వెల్లడించలేదు.
మృతుడు రాానాసింగ్ హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండేవాడు. రానాసింగ్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.