
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయాంజల్ లో దారుణం జరిగింది. వీసా రిజెక్ట్ అయిందని హెడ్ కానిస్టేబుల్ కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూర్ గ్రామం తుర్కయాంజల్ లో నివాసముండే గజాడి కృష్ణ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తాడు. గజాడి కృష్ణ పెద్ద కుమారుడు శివ కుమార్(25) విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. వీసా కోసం పలు మార్లు అప్లై చేశాడు. వీసా రిజెక్ట్ అవ్వడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆన్లైన్ లో గడ్డి మందును ఆర్డర్ పెట్టుకొని ఏప్రిల్ 25న తాగి ఆత్మహత్యాయత్నంచేశాడు. అది గమనించిన కుటుంభసభ్యులు వెంటనే యశోదా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏప్రిల్ 30న ఉదయం మృతి చెందాడు.
మృతుడి తండ్రి ఫిర్యాదుతో ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇబ్రహీంపట్నం మార్చురీలో పోస్టు మార్టూన్ అనంతరం మృతదేహాన్ని కుటుంభసభ్యులకు అప్పగించారు పోలీసులు.