గ్రహాంతరవాసి తల..రూ.5.3 కోట్లు!

హాలివుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ సినిమా ‘ఈ.టీ. ద ఎక్స్ ట్రా టెర్రెస్ట్రియల్’ సినిమాలో గ్రహాంతరవాసి పాత్ర కోసం రూపొందించిన ఈ తోలుబొమ్మలాంటి ‘మెకానికల్ యానిమాట్రోనిక్’ ఈటీ తల వేలంలో భారీ మొత్తంలో ధర పలికింది. అమెరికా, కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్ లో ఇటీవల జూలియన్స్ ఆక్షన్స్ సంస్థ వేలం వేయగా.. ఏకంగా 6.35 లక్షల డాలర్ల(రూ. 5.3 కోట్లు) మొత్తానికి అమ్ముడుపోయింది. 

గ్రహాంతరవాసులు ఉంటే ఇలాగే ఉంటారేమోనన్నంతగా అందరి మనసుల్లో నిలిచిపోయిన ఈ ‘ఈటీ హెడ్’ను ప్రముఖ హాలీవుడ్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ కార్లో రాంబాల్డి రూపొందించారు. ఒక మెటల్ ఫ్రేమ్ కు ఫోమ్ లేటెక్స్ స్కిన్ ను జోడించి దీనిని తయారు చేశారు.