కూకట్పల్లిలో సీఐ ఇంట్లో బర్త్డే పార్టీ..హెడ్ కానిస్టేబుల్ మృతి

కూకట్పల్లిలో  సీఐ ఇంట్లో బర్త్డే పార్టీ..హెడ్ కానిస్టేబుల్ మృతి

కూకట్ పల్లిలోని దేవి నగర్ లో  దారుణం జరిగింది. బర్త్ డే పార్టీలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. అసలేం జరిగిందంటే..  రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ లో సిఐగా విధులు నిర్వహిస్తున్న  శేఖర్.. తన ఇంట్లో ఫ్రెండ్స్ కు  బర్త్ డే పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి 30 మంది ఫ్రెండ్స్  అటెండ్ అయ్యారు. ఇందులో 10 మంది పోలీసులు ఉన్నారు. 

అయితే  డిన్నర్ చేస్తుండగా డేవిడ్ అనే హెడ్ కానిస్టేబుల్  మూడవ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో  ఘటన స్థలంలోనే మృతి చెందాడు బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ డేవిడ్. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 194 బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.