హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న హెడ్మాస్టర్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థులు శ్రీపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాను కలిసి వినతిపత్రంతో పాటు యూనియన్ డైరీని అందించారు.
సర్వీస్ రూల్స్ ఇవ్వాలని ఖాళీగా ఉన్న ఎంఈవో, జేఎల్, డైట్ లెక్చరర్లను ప్రమోషన్ల ద్వారా నింపాలని కోరారు. కాగా.. త్వరలో జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థులు శ్రీపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్, మారెడ్డి అంజిరెడ్డి తెలిపారు.