మంత్రి దామోదర చొరవ..సమ్మె విరమించిన ఆరోగ్య మిత్రలు

మంత్రి దామోదర చొరవ..సమ్మె విరమించిన ఆరోగ్య మిత్రలు

హైదరాబాద్: మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో సమ్మె విరమించారు ఆరోగ్య మిత్రలు. గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు, డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ఆరోగ్యమిత్రలు సమ్మె విరమించారు. 

ఆరోగ్య మిత్ర ప్రతినిధులతో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా శుక్రవారం ( సెప్టెంబర్ 20, 2024) సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం క్యాడర్ మార్పు( డేటా ఆపరేటర్), ఆరోగ్య మిత్రల జీతాలు రూ.15వేల 600 నుంచి రూ.19వేల 500లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో తమ డిమాండ్లు నెరవేయాయని సమ్మె విరమిస్తూ ఆరోగ్య మిత్రలు లేఖ విడుదల చేశారు. 

ప్రభుత్వం సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆరోగ్య మిత్రలు స్వాగతించారు. యధావిధిగా ఆరోగ్యశ్రీ సేవల విధులలో పాల్గొంటున్నట్టుగా ప్రకటించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు. 

ALSO READ | స్టార్హెల్త్ ఇన్సూరెన్స్ డేటా.. టెలిగ్రామ్లో అమ్ముతున్నారు

గత 2 రోజులుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు సమ్మె చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, ఆరోగ్య మిత్ర ల స్టేట్ కమిటీ నాయకులతో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం ఆరోగ్య మిత్రలకు క్యాడర్ మార్పులు, జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు.