హిందూ ధర్మంలో పూజలు.. పునస్కారాలు.. మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆరోగ్యం బాగ లేకపోయినా.. ఆర్దిక ఇబ్బందులతో సతమతమవుతున్నా చాలా మంది పండితులను, జ్యోతిష్య నిపుణులను సంప్రదించి..వారి సూచనల ప్రకారం ఫాలో అవుతుంటారు. అయితే గరుణపురాణంలో వీటికి సంబంధించి ప్రత్యేక మంత్రాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఆమంత్రాలు ఏమిటి.. వాటిని ఎలా పఠించాలి.. అసలు గరుణ పురాణంలో ఏముంది,, ఆ మహా మహిమానిత్వ మంత్రాలు ఏమిటో తెలుసుకుందాం..
గరుడ పురాణానికి అధిపతి శ్రీ హరి విష్ణు. హిందూ మతంలో ఎవరైనా చనిపోయినప్పుడు.. అక్కడ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా ఆ వ్యక్తి ఆత్మ మోక్షాన్ని పొందుతుందని విశ్వాసం. గరుడ పురాణం అనేక వ్యక్తులకు చెందిన కర్మను వాటి ఫలితాలను గురించి విశదీకరిస్తుంది. ఎవరైనా సరే ఎటువంటి సందర్భం ఎదురైనా మంచి పనులు చేయలని ప్రేరేపిస్తుంది. ఇలాంటి గరుడ పురాణంలో కొన్ని మంత్రాలను ప్రస్తావించారు. వీటిని జపించడం వలన వ్యాధుల నుంచి ఉపశమనం, ఆర్థిక లాభాన్ని పొందవచ్చు
సనాతన హిందూధర్మంలో 18 పురాణాలు, 4 వేదాలు ఉన్నాయి. 18 పురాణాలలో గరుడ పురాణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో దీనిని మహాపురాణం అంటారు. గరుడ పురాణానికి అధిపతి శ్రీ హరి విష్ణు. హిందూ మతంలో ఎవరైనా చనిపోయినప్పుడు.. అక్కడ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా ఆ వ్యక్తి ఆత్మ మోక్షాన్ని పొందుతుందని విశ్వాసం. గరుడ పురాణం అనేక వ్యక్తులకు చెందిన కర్మను వాటి ఫలితాలను గురించి విశదీకరిస్తుంది. ఎవరైనా సరే ఎటువంటి సందర్భం ఎదురైనా మంచి పనులు చేయలని ప్రేరేపిస్తుంది. ఇలాంటి గరుడ పురాణంలో కొన్ని మంత్రాలను ప్రస్తావించారు. వీటిని జపించడం వలన వ్యాధుల నుంచి ఉపశమనం, ఆర్థిక లాభాన్ని పొందవచ్చు.
ఆర్దిక ఇబ్బందులను తొలగించే మంత్రం:
ఓం జుమ్ స: ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పేదరికం నుంచి తక్కువ సమయంలో బయటపడవచ్చు అని.. త్వరలోనే ఆర్దిక ఇబ్బందులు తీరి ధనవంతుడు అవుతాడని పండితులు చెబుతున్నారు. అంతేకాదు గరుడ పురాణంలో శ్రీ విష్ణు సహస్త్రానామ మహిమ ప్రస్తావన కూడా ఉంది. ఆరు నెలల పాటు విష్ణు సహస్ర నామ పఠనం చేస్తే జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి తొలగిపోతుందని నమ్మకం.
సంజీవని మంత్రం
యక్షి ఓం ఓం స్వాహా :సంజీవని మంత్రం గరుడ పురాణంలో కూడా ప్రస్తావించబడింది. గరుడ పురాణం ప్రకారం ఈ మంత్రాన్ని జపించే వ్యక్తి ఇతరుల జీవితాల్లో కూడా ఆనందాన్ని తీసుకురాగలడు. అయితే మంత్రాలను జపించే ముందు పూర్తి నియమాలను తెలుసుకున్న తర్వాత.. నిరూపితమైన వ్యక్తి నుంచి నేర్చుకుని సంజీవని మంత్రాన్ని ఉపయోగించాలి. అంతేకాదు మంత్రాలను ఎల్లప్పుడూ లోక కల్యాణానికి ఉపయోగించాలి.
గరుడ పురాణం ప్రాముఖ్యత
18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. గరుడ పురాణంలో 19 వేల శ్లోకాలు ఉన్నాయి. వీటిల్లో ఏడు వేల శ్లోకాలు జీవితానికి సంబంధించిన లోతైన విషయాలను వివరిస్తాయి. ఇది జ్ఞానం, మతం, విధానం, రహస్యం, ఆత్మ, స్వర్గం, నరకం వంటి వివరణను కలిగి ఉంది. గరుడ పురాణం చదవడం లేదా వినడం ద్వారా ఎవరైనా సరే జ్ఞానోదయం, పుణ్యం, భక్తి, జ్ఞానం, యాగం, తపస్సు, తీర్థయాత్ర మొదలైన వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటాడు. కనుక ప్రతి ఒక్కరూ వీలైనప్పుడు గరుడ పురాణం గురించి తెలుసుకోవాలి..