శక్తిని ఇవ్వడమే కాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది ఖర్జూరం. చినుకులు పడుతున్న ఈ టైంలో ఖర్జూరం తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు
- ఫైబర్, పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉండే వీటిని తింటే తీపి పదార్థాలు తినాలని అనిపించదు. ఖర్జూరంలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా వీటిని తినొచ్చు.
- ఏ టైంలో తినాలంటే... ఉదయాన్నే, లంచ్ తర్వాత, పిల్లలు, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు లంచ్ టైంలో ఖర్జూరం తినడం తప్పనిసరి.
- ఖర్జూరం తింటే హిమోగ్లోబిన్ శాతం, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.
- ఇందులోని ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పుని తగ్గిస్తాయి. నిద్ర సమస్యలు ఉన్నవాళ్లు ఖర్జూరం తింటే మంచిది.
- వర్షాకాలంలో వచ్చే చాలా వరకు ఇన్ఫెక్షన్లు, అలర్జీల బారిన పడకుండా ఉండొచ్చు.
- ఖర్జూరం తింటే ఎక్సర్సైజ్ చేసే సామర్థ్యం పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యల నుంచి రిలీఫ్ ఉంటుంది.