కొన్ని అలవాట్లు జీవన శైలిని ఆరోగ్యవంతంగా చేస్తాయి. వాటిల్లో కొన్నింటి ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ సాధించొచ్చు. అలాంటి యాక్టివిటీస్లో 'ది బెస్ట్ ఎక్సర్ సైజ్'గా యోగాకి పేరుంది. శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా అందిస్తుంది. ఆ గొప్పతనమే దానికొక ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కేలా చేసింది. అందుకే యోగాని అలవాటుగా చేసుకుంటే లైఫ్ మరింత హెల్దీగా, హ్యాపీగా ఉంటుంది.
మరికొన్ని బెనిఫిట్స్
- ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు చాలా మంది. ఆ సమస్యను దూరం చేసి ప్రశాంతమైన టైఫ్ స్టైల్ ని అందిస్తుంది యోగా.
- కార్బల్ టెన్నెల్ సిండ్రోమ్... అంటే చాలా మందికి మణికట్టు దగ్గర విపరీతమైన సమస్య ఉంటుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
- మల్టిపుల్ స్క్లెరోసిస్(ఎంఎస్) డిసీజ్.. రక్తప్రసరణ సజావుగా సాగకపోవడం. వల్ల కలిగే వ్యాధి. బ్రెయిన్, వెన్నెముక, కళ్లు.. ఇలా అవయవాలన్నింటిపై ఒకేసారి ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. చేతులు, కాళ్లు తిమ్మిరిగా ఉండటం, అలసట, బాడీ బ్యాలెన్స్ తప్పడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే యోగాతో ఈ సమస్యను కొంత వరకు నివారించుకోవచ్చు.
- హార్మోన్ బ్యాలెన్సింగ్ యోగా ముఖ్యపాత్ర పోషిస్తుంది. క్లోమ గ్రంథుల్ని యాక్టివ్ చేసి, ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరిగేలా చేస్తుంది. ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంది.