
చాలా మంది ఉదయం నిద్ర నుంచి లేవగానే మంచి నీరు తాగుతుంటారు. ఈ అలవాటు మంచిదని కొందరంటుంటారు. కానీ కొందరు మాత్రం బ్రష్ కూడా చేయకుండా ఇలా నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వాదిస్తూ ఉంటారు. అయితే దీని వల్ల అసలు ప్రయోజనాలు ఉంటాయా.. ఉంటే ఎలా ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పళ్లు తోముకునే ముందు నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
- ఖాళీ కడుపుతో నీరు తాగడం లేదా పళ్ళు తోముకునే ముందు నీరు తాగడం వల్ల శరీరం నుంచి చెడు పదార్థాలు తొలగిపోతాయి. ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల కూడా శరీరంలోని అనేక రకాల వ్యాధులు దూరం అవుతాయి.
- ఉదయం లేవగానే బ్రష్ చేయకముందే నీరు తీసుకోవడమనేది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందడంలో కూడా సహాయపడుతుంది.
- ఊబకాయం, మలబద్ధకం, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
- ఇది నోటిలో బ్యాక్టీరియా చేరడాన్ని నిరోధిస్తుంది, కావిటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది.
- నోటిలో లాలాజలం లేకపోవడం వల్ల, మన నోరు పూర్తిగా పొడిగా మారుతుంది. ఇది హాలిటోసిస్ సమస్యను కలిగిస్తుంది.
- దీన్ని బట్టి చూస్తుంటే మార్నింగ్ ఖాళీ కడుపులో నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని తెలుస్తోంది. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా ఉదయం లేచీ లేవగానే మంచి నీరు తీసుకోవచ్చన్నమాట.