Good Health: పచ్చి వెల్లుల్లి తింటే ఇన్ని లాభాలా.. తెలిస్తే డైలీ తింటారు..

Good Health: పచ్చి వెల్లుల్లి తింటే ఇన్ని లాభాలా.. తెలిస్తే డైలీ తింటారు..

అల్లం వెల్లుల్లి లేకుండా తెలుగు వంటలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు.. వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు.. ప్రతీ వంటకంలో అల్లం వెల్లుల్లి తప్పకుండా వాడాతాం కదా. ఇక వెల్లుల్లి అయితే ఇంకొంచెం స్పెషల్. కూరలో అల్లం పేస్ట్ వేసినప్పటికీ తాలింపు వేయాలంటే వెల్లుల్లి ఉండాల్సిందే. 

వెల్లుల్లిని రెగ్యులర్ గా వంటకాల్లో వాడతాం కానీ.. దాని నుంచి వచ్చే లాభాలేంటో చాలా మందికి తెలియదు. ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’ అనే సామెత ఉంది కదా.. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి వెల్లుల్లి చేసిన మేలు ఉల్లి కూడా చేయదంటే నమ్మాల్సిందే. 

ఇప్పుడున్న బిజీ లైఫ్ లో సగం మంది ఇంటి వంటలు తింటే.. సగం మంది బైట తినడం కామన్ అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్, పిజా బర్గర్, చికెన్ బిర్యానీ, వెజ్ నాన్ వెజ్ ఫ్రై.. ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే వంటకాలను ఎప్పుడో ఒకసారి ఓ పట్టు పట్టేస్తుంటాం. కొందరైతే రెగ్యులర్ గా తింటుంటారు. ఇలాంటి ఫుడ్ తినడం వలన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులకు కారణం అవుతుంది. కొలెస్ట్రాల్ ను కరిగించడంలో పచ్చి వెల్లుల్లి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంటుంది. 

పచ్చి వెల్లుల్లి వలన కలిగే లాభాలు ఇవే:

అల్లిసిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఇమ్యూనిటీ పెంచుతుంది. అంటే రోగనిరోధక శక్తిని పెంచడంలో పచ్చి వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది. 

పచ్చి వెల్లుల్లి తినడం వలన కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె ఆరోగ్యం పెరుగుతుంది.

లివర్ ఎంజైమ్ లను యాక్టివ్ గా చేసి బాడీని డీటాక్సిఫై చేస్తుంది. అంటే బాడీలో విషపూరిత మలినాలను తొలగిస్తుంది.

గట్ బ్యాక్టీరియా (మంచి బ్యాక్టీరియా)ను పెంచీ ఇతర క్రిములను పోరాడుతుంది. అలాగే జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. 

శరీరంలో ఉండే మంటలను తగ్గించడంలో తోడ్పడుతుంది.

ఎన్సులిన్ స్థాయిని కంట్రోల్ చేసి బ్లడ్ షుగర్ ను రెగ్యులేట్ చేస్తుంది. 

ఫంగస్ తో పోరాడి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.