బొప్పాయి పండు ... ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. అంతేకాదు డెంగ్యూలాంటి విషజ్వరాలకు ఇది మంచి ఔషధం. ఇక పచ్చి బొప్పాయి కాయను తింటే చాలా ప్రయోజనాలున్నాయనిఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి బొప్పాయిని..ఆనపకాయ కూర చేసిన విధంగాబొప్పాయి కర్రీ కూడా చేసుకొనితినవచ్చు. పచ్చి బొప్పాయి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. . .
పచ్చి బొప్పాయిని తినడం వలన ఉదర సంబంధిత రోగాలు నయమవుతాయి. రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. బొప్పయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, వంటి అనేక పోషకాలు ఉండటాయి. పచ్చి బొప్పాయి తినడం వలన శరీరంలో గాయాలను త్వరగా మానిపోతాయి. చర్మ సౌందర్యానికి కూడా బొప్పాయి చాలా బాగా ఉపయోగపడతుంది. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయి లోనే యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి.-
పచ్చి బొప్పాయి కాయ ఉండే ప్రొపైన్ లు మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. స్థూలకాయం, అజీర్తితో బాధపడేవారు వీటిని తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు పీసీఓడీ తో బాధపడపతున్నారు. పచ్చిబొప్పాయి తినడం వలన ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. అలానే గుండె సంబంధిత సమస్యల నుండి దూరం చేస్తాయి. పచ్చిబొప్పాయి తినడం వల్ల విటమిన్ ఎ, సి, మన శరీరంలోని రోగనిరోధక శక్తి పెంచుతుంది. బొప్పాయి ఆకులు తినడం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వైరల్ ఫీవర్ల నుండి కాపాడుతుంది.కడుపులోని మలినాలను బయటకు పంపుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది. కంటి సంబంధిత వ్యధులు, విటమిన్ల లోపం రాకుండా చూస్తుంది.
పచ్చి బొప్పాయిలో ప్రొటియోలాటిక్ ఎంజైమ్ ఉంటుంది. వీటి నుండి అనేక మెడిసన్ తయారు చేస్తారు. కామెర్లు వంటి వ్యాధితో బాధడేవారికి దివ్యౌషధం. అయితే గర్భిణీలు పచ్చి బొప్పాయిని తినకూడదు. ఎందుకంటే.. వాటిలో ఉండే లేటెక్స్ పాలవంటి పదార్ధం గర్భాశయంపై ప్రభావం చూపుతుంది. అందుకే తినకూడదు అంటారు. కానీ డెలివరీ అయ్యాక తల్లికి పాలు బాగా పడాలంటే పచ్చి బొప్పాయి ఎంతో అవసరం. పచ్చి బొప్పాయిలో కెరోటినాయిడ్స్ టొమాటో, కారెట్ కంటే ఎక్కవ మొత్తంలో ఉంటాయని బ్రిటీష్ జనరల్ ఆఫ్ న్యూట్రీషన్ చేసిన అధ్యయనంలో తెలిసింది. బొప్పాయిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఆస్తమా, ఆస్టియో ,ఆర్ధరైటిస్ డిసీజ్ లనుండి ఉపశమనం లభిస్తుంది.