ఈ రోజుల్లో జనాలు చిన్నవారి దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకు ఊబకాయం.. అధిక బరువుతో బాధ పడుతున్నారు. ఒక్కోసారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే అధిక బరువు తగ్గేందుకు తినే ఆహారంలో వారానికి రెండు సార్లు దొండకాయ తింటే క్రమేపీ ఈ సమస్య నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.బరువు తగ్గించుకునేందుకు దొండకాయ కీలక పాత్ర పోషిస్తుందట. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో బరువు పెరగడం అనేది ఓ సమస్యగా మారింది. చిన్న పిల్లల నుంచి మొదలుకుని పెద్దవారి వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు అనేది తరచూ అతి పెద్ద సమస్యగా మారుతుంది. దీని కారణంగా ఆహారపదార్థాల్లో ముఖ్యమైన దొండకాయను తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది సహాయపడుతుంది. వారంలో రెండు సార్లు అయినా దొండకాయను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అధిక బరువు సమస్యతో బాధపడేవారికి ఇంట్లోని ఆహార పదార్థాలతో ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. మార్కెట్లో ఎక్కువుగా లభించే కూరగాయల్లో దొండకాయ ఒకటి. దొండకాయను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దొండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
అయితే కొంతమంది దొండకాయ తినడం వలన జ్ఞాపక శక్తి తగ్గుతుందని.. మతి మరుపు లాంటి సమస్యలు వస్తాయని చాలామంది అంటుంటారు. కాని ఇదంతా ఒక అపోహ మాత్రమేనని.. దొండకాయలు చాలా పోషక పదార్ధాలున్నాయని .... అవి చాలా మేలు చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. దొండకాయలో ఉండే ఫైబర్ పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దొండకాయలో విటమిన్ సీ, ఐరన్ అధికంగా ఉండటంతో రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. దొండకాయలో గ్లూకోజ్ లెవల్స్ క్రమబద్దీకరించే గుణం ఉండటంతో షుగర్ ఉన్న వారికి దొండకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. అంతేకాదు దొండకాయ రోగనిరోధక శక్తిని పెంచడంతో కీలక పాత్ర పోషిస్తుంది.