Good Health : మీ బీపీ తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ ఫ్రూట్ మిక్స్ డ్రింక్స్ తాగండి..!

Good Health : మీ బీపీ తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ ఫ్రూట్ మిక్స్ డ్రింక్స్ తాగండి..!

అరటి పండు హెల్తీ ఫుడ్.. బాడీకి కావాల్సిన అనేక రకాల పోషకాలు అరటిలో మెండుగా ఉంటాయి. కరెక్ట్ టైంలో అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అరటి పండి ఇలా తింటే మీ బీపీ మొత్తం కంట్రోల్ లో ఉంటుంది. ఉదయాన్ని ఖాళీ కడుపుతో రెండు అరటి పండ్లతోపాటు ఓ గ్లాస్ పాలు తీసుకుంటే హైబీపీని నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మార్నింగ్ ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటిపండులో పుష్కలంగా పొటాషియం ఉంటుంది. ఇది బిపిని కంట్రోల్ చేస్తోందని ప్రాక్టికల్ గా కూడా నిరూపించబడింది. అరటిపండులో విటమిన్ B6, సి కూడా ఉన్నాయి. అలాగే పాలలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియం మరియు జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా అరటిపండును పాలతో కలిపి తినడం వల్ల రోజంతా యాక్టివ్ గా, ఎనర్జటిక్ గా ఉంటారు.

పాలతో అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు 

హైబీపీ కంట్రోల్ చేస్తుంది

హైబీపీ పేషెంట్లు ఖాళీ కడుపుతో ఓ గ్లాస్ పాలు తాగి, రెండు అరటి పండ్లు తింటే శరీరానికి పొటాషియం అందుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే అరటిపండ్లు, పాలు బిపి రోగులకు మంచివిగా భావిస్తారు.

ALSO READ | Good Health: ఉద్యోగులూ మీ కోసమే.. టెన్షన్ ను ఇలా చిత్తు చేద్దాం.. హెల్త్ కోసం ఇవి తినండి..!

బరువు పెరగడానికి 

బరువు పెరగాలనుకునే వారు ప్రతి రోజు అల్పాహారంగా అరటిపండు తినాలి. సన్నగా ఉన్నారని ఆందోళన చెందుతుంటే, ప్రతి రోజూ ఉదయం అల్పాహారంగా అరటిపండు షేక్ చేసి తాగండి. పాలు మరియు అరటిపండు కలయికలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువును పెంచుతుంది.

బలమైన ఎముకలు

పాలు, అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం, ప్రోటీన్, ఇతర విటమిన్లు అందుతాయి. దీంతో ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బోన్స్ స్ట్రాంగా మారుతాయి.

జీర్ణవ్యవస్థ మెరుగు

అరటి పండు జీర్ణక్రియలను వేగవంతం చేస్తుంది. ప్రోటీన్, కాంప్లెక్స్‌తో కూడిన అరటిపండ్లు, పాలు మీ జీవక్రియ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. పాలు, అరటిపండ్లు తింటే పొట్ట సమస్యలు తగ్గుతాయి. ఈ ఫుడ్ సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.