ఇప్పుడు రోడ్ల పక్కన ఎక్కడ చూసినా... ఆకుపచ్చ రంగులో యాపిల్ పండ్లను పోలిన పండ్లే కనిపిస్తున్నాయి. ఒకప్పటి కంటే ఇప్పుడు ఆ పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. అవే పియర్ పండ్లు, తక్కువ తీపితో రుచిగా ఉండే పియర్ పండ్లను తింటే... బరువు తగ్గడమే కాదు, టైప్- 2 డయాబెటిస్, గుండె జబ్బులు కూడా తగ్గుతాయట. వాటిలో ఉండే ఫైబర్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 178 గ్రాముల పియర్ పండులో 101 క్యాలరీలతోపాటు 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
యాపిల్ పండులాగే.. చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. పియర్ పండ్లు. ఎవరైనా వీటిని తినొచ్చు. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ పిలుస్తారు. పియర్స్ పండులో క్యాల్షియం, పాలేటి, ఐరన్ పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ C. K.K. ఉంటాయి. అలాగే బీటాకెరోటిన్, బ్యూరెయిన్ రెటినాల్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. రెగ్యులర్ గా పియర్స్ తినడం వల్ల బరువు తగ్గుతున్నట్లు, టైప్-2 డయాబెటిస్ గుండె జబ్బుల వంటివి నయమవుతున్నట్లు పరిశోధనలో తేలింది.
డయాబెటిస్ కి చెక్
డయాబెటిస్ ఉన్న వాళ్లు అన్నిరకాల పండ్లు తినకూడదు, కానీ పియర్స్ మాత్రం తక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ క్యాలరీలు. ఎక్కువ ఫైబర్ (పీచు పదార్థం)తో అందరూ తినేందుకు వీలవుతుంది. పైగా ఇందులో మన శరీరంలో విషవ్యర్థాల్ని తొలగించే యాంటీ అక్సిడెంట్స్ ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లలో ఒకవేళ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నార్మల్స్థాయికి తీసుకురాలేకపోతే తీవ్ర ఆనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రెగ్యులర్ ట్రీట్ మెంట్, సరైన ఆహారం, ఎక్సర్ సైజ్ వంటివి చేస్తుంటే అధిక బరువు తగ్గడమే కాకుండా... షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. పియర్స్ లో ఉండే ఫైబర్ వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలా బాడీ వెయిటీ కంట్రోల్లో ఉంటుంది.
బరువు తగ్గించే పియర్ పండు
పియర్స్ లో ఎక్కువ భాగం నీళ్లు, పీచు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే.. పొట్టనిండిపోయిన పీలింగ్ కలుగుతుంది.. దాంతో వేరే ఆహార పదార్థాలు తినలేరు. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం తప్పుతుంది. ఈ పండ్లలోని పెక్టిన్ అనే పదార్థం... పియర్స్ ను త్వరగా జీర్ణం కాకుండా చేస్తుంది. ఇటీవల జరిగిన సర్వే ప్రకారం... రోజుకు రెండు పియర్స్ తినేవాళ్లకు చుట్టూ ఉండే కొవ్వు తగ్గి.. నడుం సైజ్ 1.1 ఇంచులు (2.7 సెంటీమీటర్లు) తగ్గిందట.
జాగ్రత్తలు
టేస్ట్ బాగున్నాయి కదా అని ఫియర్స్ పండ్లను మరీ ఎక్కువగా తినకూడదు. రోజుకు రెండు కంటే ఎక్కువ పండ్లను తింటే.. కడుపులో గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు అవకాశం ఉంది. మరి పియర్ పండ్లను మితంగా తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి..