
మీరు పుషప్స్ చేస్తారా.. ?చేస్తే డైలీ ఓ నలభై పుషప్స్ చెయ్యగలరా? చెయ్య గలిగితే మీ గుండె సేఫ్ అనే లెక్క. రోజుకు 40 పుషప్స్ చేసే వాళ్లకు 96 శాతం గుండెపోటు వచ్చే అవకాశం లేదని ఓ అధ్యయనంలో కనుగొన్నారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. దీని కోసం 1104 మంది ఫైర్ ఫైటర్లని పదేళ్లపాటు వారి ఎక్స ర్ సైజ్ ఆధారంగా పరీక్షించారు.
రోజూ 40 పుష్ అప్స్ చేస్తే మంచిదని, కనీసం 10 పుష్ అప్స్ చేసినా కొంతవరకు గుండె సంబంధిత వ్యాధులు అడ్డుకోవచ్చని గుర్తించారు. పుషప్స్ సులువైన, ఖర్చులేని ఎక్సర్సైజ్ అని రోజూ చేసేందుకు ప్రయత్నించాలని పరిశో ధనల బృందం సూచించింది.
ప్రపంచంలో ఎక్కువ మరణాలకు కారణమవుతున్న వాటిలో గుండెపోటు ఒకటి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా అడ్డుకోవడానికి నడక మంచి మార్గం అని చాలాకాలంగా డాక్టర్లు సూచిస్తున్నారు.. తాజా అధ్యయనంతో పుషప్స్ చెయ్యడం వల్ల కూడా గుండె మరింత సేఫ్ గా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
–వెలుగు, లైఫ్–