తాటి ముంజల సీజన్ నడుస్తోంది. సిటీలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ప్రకృతి ప్రసాదంగా వేసవిలో మాత్రమే దొరికే తాటి ముంజలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. ఎండాకాలంలో ఇవి శరీరానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సీజన్ లో తాటి ముంజలను టేస్ట్ చేస్తున్నారు. ఎండా కాలంలో .. మామిడి పండ్లతో పాటు తాటి ముంజలు కూడా దొరుకుతాయి. హైదరాబాద్ లో చుట్టు పక్కల జిల్లాల నుంచి వీటిని తీసుకొచ్చి అమ్ముతున్నారు వ్యాపారులు. తాటి కల్లు అమ్మితే గిరాకీ లేకపోవడంతో ముంజలతో గీత కార్మికులు ఆదాయం పొందుతున్నారు. ఎండాకాలం ఈ తాటి ముంజల్లోని నీళ్లు శరీరానికి చలువ చేస్తాయి. చిన్న పిల్లలు, ముసలి వాళ్లకి చాలా మంచిది. వీటిల్లో అధికంగా తేమ శాతం, తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి.
తాటి ముంజలతో శరీరానికి వెంటనే శక్తి వస్తుందని అంటున్నారు సిటీ జనం. బయట ఉండే వేడి నుంచి ఉపశమనం పొందాలంటే రోజుకు ఒక ముంజ అయినా తినడం మంచిదని చెబుతున్నారు. ఊరికి వెళ్ళలేని వారు తాటి ముంజలను సిటీలోనే కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు. వాటిపై ఉండే పొట్టుతో కూర కూడా వండుకుంటామని చెబుతున్నారు కొందరు.
ముంజలను గంపల్లో తెచ్చి అమ్మితే తొందరగా ఖరాబ్ అవడంతో పాటు... తాజాగా ఉండవంటున్నారు వ్యాపారులు. అందుకే తాటి కాయలను తెచ్చి... అప్పటికి అప్పుడే కోసి ఇస్తే.. ఫ్రెష్ గా ఉండటంతో పాటు...పోషకాలు పోవని చెబుతున్నారు. గతంలో డజన్ ముంజలు 80 రూపాయలు ఉంటే ఇప్పుడు 100రూపాయలు పలుకుతున్నాయి. గిరాకీ బాగానే ఉందనీ.... మే నెలలో ధరలు తగ్గుతాయంటున్నారు వ్యాపారులు. తాటి ముంజలోని నీరు, ముంజను మాత్రమే తినకుండా పైన ఉండే పొట్టును కూడా తింటే జీర్ణ శక్తి పెరుగుతుందని అంటున్నారు వ్యాపారులు.
తాటి ముంజల వల్ల కలిగే ఆరోగ్య లాభాలు
తాటి ముంజలు ఎండధాటి నుంచి రక్షణ కల్పిస్తాయి.
100గ్రాముల ముంజల్లో 43 కేలరీలు ఉంటాయి.
మూడు తాటి ముంజలు తిన్నట్లయితే, ఒక కొబ్బరిబొండాన్ని తాగినంత ఫలితం ఉంటుంది.
లేత తాటిముంజల్లో ఎనభై శాతానికి పైగా నీరే ఉంటుంది.
వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజలు చక్కని ఫలహారం.
ఆటలమ్మ వంటివి సోకినప్పుడు శరీరంపై ఏర్పడే పుండ్లపై తాటిముంజల నీటిని పట్టిస్తే దురద తగ్గి, అవి త్వరలోనే మానిపోతాయి.
కొన్ని ప్రాంతాల్లో తాటిముంజెలతో శీతలపానీయాలను కూడా తయారు చేస్తారు. తమిళనాడులో తాటిముంజల పానీయాన్ని ‘ఎలనీర్ నుంగు’ అంటారు.
SRH నుండి మరో క్రికెటర్ ఫేమస్.. అతని తండ్రి కూరగాయల వ్యాపారి
ఎఫ్ -3 ట్రైలర్ వచ్చేస్తుంది..!
రషీద్ ధమాకా
భగీరథ నీటిలో రొయ్యపిల్ల