Good Health: అల్లం టీ తాగుతున్నారా? అయితే మీరు సేఫ్....

ప్రతిరోజూ ఉదయం టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే కొందరు కేవలం ఉదయం అనే కాకుండా రోజులో చాలాసార్లు టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, మామూలు టీ తాగడం కంటే అల్లం టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అల్లంలో విటమిన్ సి మెగ్నీషియం ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. మానవ శరీరానికి ఉపయోగపడే ఎన్నో గొప్ప గుణాలు దీనిలో ఉన్నాయి. దీన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. రెగ్యులర్ గా అల్లం టీ తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయి .  అల్లం వల్ల శరీరానికి చాలా ఉపయోగాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్లం టీ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఆహారం అధిక మోతాదులో తిన్నప్పుడు అది అరగడానికి కొందరు చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఆహారం తిన్న తర్వాత కప్పు అల్లం టీ తాగితే అది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడమే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అల్లంలో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణ మెరుగుపడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి 

అల్లం టీ గుండె సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. అల్లం గడ్డకట్టిన రక్తాన్ని పలుచగా చేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి రోజూ తీసుకుంటే చాలా మంచిది. పీరియడ్స్ ఓ 4 రోజుల ముందు నుంచే అల్లం టీ తాగడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పులు చాలా వరకు దూరమవుతాయి.  సకాలంలో నెలసరి రాకపోవడం వల్ల ఆడవారు ఇబ్బందిపడుతుంటారు. అలాంటి ఇబ్బంది ఉన్నవారు వేడి వేడి అల్లం టీ, తేనె కలిపిన ఒక కప్పు టీని కూడా నెలసరి సమయం తీసుకుంటే మంచిదే.అల్లంలో యాటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీన్ని తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం టీ బాగా పనిచేస్తుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ కారణంగా శరీరంలోని కొవ్వులాంటి పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి త్వరలోనే అధిక బరువు అదుపులోకి వస్తుంది. 

అల్లం టీ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. అంతేకాకుండా రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గించే గుండెపోటు అనేది రాకుండా చేస్తుంది.  శ్వాస సంబంధిత సమస్యల నుండి కాపాడుతుంది. చలికాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్య ముక్కు దిబ్బడ శ్వాస సరిగా పీల్చుకోలేకపోవడం అల్లం టీతో అలాంటి వాటికి చెక్ పెట్టొచ్చు. జలుబు చేసినా ముక్కు దిబ్బడగా ఉన్న ఒకప్పు అలాంటి తాగితే ఉపశమనం ఉంటుంది. వికారం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ తేన్పులు, జీర్ణ సమస్యతో బాధపడేవారికి కూడా అల్లంటీ చాలా మంచిది. 40 ఏళ్లు దాటిన వ్యక్తులకు నడుంనొప్పి, కీళ్లనొప్పులు వస్తుంటాయి. అలాంటి వారు కూడా అలాంటి తాగొచ్చు.

చాలా మందికి ఉదయాన్నే వేడివేడిగా టీ గొంతులో పడితే కానీ మనసు ఊరుకోదు. ఉత్సాహంగా కూడా పనిచేస్తారు టీకి అల్లం జోడిస్తే ఆరోగ్యానికి మంచిది కూడా. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి మెగ్నీషియం, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రయాణాల్లో కడుపు తిప్పే వారికి వాంతులు అయ్యే వారికి అలాంటిస్తే ఉపశమనం కలుగుతుంది.జలుబు, జ్వరం ఉన్నవారు అల్లం టీ తాగాలి, మెరుగైన రక్తప్రసరణకు అల్లం టీ బాగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు అలాంటితో చెక్ పెట్టవచ్చు. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి సమస్యలకు అల్లంటీ బెస్ట్‌....